Tamil Nadu: హోంవర్క్‌ ఒత్తిడి తట్టుకోలేక 9వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య

హోం వర్క్‌ ఒత్తిడి తట్టుకోలేక ఓ పాఠశాల విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Tamil Nadu: హోంవర్క్‌ ఒత్తిడి తట్టుకోలేక 9వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య
Student Suicide

Updated on: Aug 25, 2022 | 1:30 PM

School Student dies by suicide in TN: హోం వర్క్‌ ఒత్తిడి తట్టుకోలేక ఓ పాఠశాల విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని పెరళంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 14 ఏళ్ల సంజయ్‌ 9వ తరగతి చదువుతున్నాడు. తాను చదివే పాఠశాలలో రోజూ ఇచ్చే హోం వర్క్‌ కారణంగా సంజయ్‌ తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడు. ఈ పాఠశాలలో హోం వర్క్‌ విషయమై వేధిస్తున్నారని, తనను వేరే స్కూల్‌కి మార్చమని తల్లిదండ్రులను బాలుడు కోరాడు. అందుకు సంజయ్‌ తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో మరింత ఒత్తిడికి గురైన బాలుడు సోమవారం ఉదయం (ఆగస్టు 22) నివసముంటున్న ఇంట్లోనే పెట్రోల్‌ శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు హుటాహుటిన తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన సంజయ్‌ చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 23) మృతి చెందాడు. ఈ ఘటనపై పేరాళం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.