
మార్చి 23 నుండి ఏప్రిల్ 6 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, పాల్గొన్నవారికి ఉప యోగ, సూర్య క్రియ, అంగమర్దన, ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ వంటి శక్తివంతమైన యోగ ప్రక్రియల్లో వీరికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. వ్యక్తిగత పరివర్తన, అంతర్గత సమతుల్యత, రక్షణ దళాలలో ఈ పద్ధతులను పంచుకునే సామర్థ్యంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది.
కార్యక్రమం ఉద్దేశం
దేశ రక్షణ కోసం అంకితభావంతో పనిచేసే సైనికులకు ప్రాచీన క్లాసికల్ హఠయోగ శాస్త్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ శిక్షణ పొందిన సిబ్బంది ఇప్పుడు తమ తమ రక్షణ కేంద్రాలకు వెళ్లి, అక్కడ ఉన్న తోటి సైనికులకు ఈ యోగ విద్యను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.
పాల్గొన్నవారి అనుభవాలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక స్పష్టతను, భావోద్వేగ సమతుల్యతను ఇచ్చే అంతర్గత సాంకేతికత అని కొనియాడారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ కెప్టెన్ శ్రీకాంత్ జోషి మాట్లాడుతూ.. ఈ శిక్షణ వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభించాయని.. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటూ సమర్థవంతంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది అని తెలిపారు.
ఇక కమాండర్ రాహుల్ జైస్వాల్ మాట్లాడుతూ..యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు, మన లోపలికి మనం చూసుకోవడం అన్నారు. ఇది ఒత్తిడిని నిర్వహించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది అని తెలిపారు. ఈ శిక్షణ తర్వాత తన శరీరం ఇప్పుడు మరింత సరళంగా మారిందని, మనస్సు ప్రశాంతంగా ఉందని లెఫ్టినెంట్ అంజలి గోయల్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
యోగ సెషన్లతో పాటు, రక్షణ సిబ్బంది ఈషా విద్యా పాఠశాలను సందర్శించారు. ధ్యానలింగం, లింగ భైరవి, తీర్థకుండాల వంటి పవిత్ర ప్రదేశాలను దర్శించుకున్నారు. కృతజ్ఞతా భావంతో, వారు భిక్షా హాల్‌లో అన్నదానం చేసి అక్కడి సాధకులకు భోజనం వడ్డించారు. ఈ సేవ తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కెప్టెన్ జోషి పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.