9 Years Of PM Modi: మోడీ తొమ్మిదేళ్ల పాలన.. ప్రధాని గురించి ఎవరికీ తెలియని 9 ఆసక్తికర విషయాలు..

|

May 25, 2023 | 8:48 AM

నరేంద్రమోడీ.. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ సంబురాలు నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ప్రధాని మోడీ.. మే 30తో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకోనున్నారు.

9 Years Of PM Modi: మోడీ తొమ్మిదేళ్ల పాలన.. ప్రధాని గురించి ఎవరికీ తెలియని 9 ఆసక్తికర విషయాలు..
Pm Modi
Follow us on

నరేంద్రమోడీ.. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ సంబురాలు నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ప్రధాని మోడీ.. మే 30తో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకోనున్నారు. మే 26, 2014న తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 30, 2019న రెండోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. రెండు సార్లు అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గురించి ఎవరికీ తెలియని తొమ్మిది ఆసక్తికర విషయాలు మీకోసం..

  1. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ. అంతకుముందు ప్రధానులంతా స్వాతంత్ర్యం ముందు జన్మించిన వారున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.
  2. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిక్కు వేషం ధరించారు. అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసిన అగ్రనేతలకు ఆయన కీలక సమాచారం అందించినట్లు చెబుతుంటారు.
  3. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చిన్నతనంలో స్థానిక రైల్వే స్టేషన్‌లోని తన టీ స్టాల్‌లో తన తండ్రికి సహాయం చేసేవారు. పాఠశాలలో విద్య అభ్యనిస్తున్న సమయంలో.. 13, 14 ఏళ్ల వయసులో పాడైపోయిన తన ఇంటి గోడను బాగుచేయడానికి నరేంద్ర మోడీ.. డబ్బు సంపాదించేందుకు పలు నాటకాల్లో పాల్గొనేవారు.
  4. 1985లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో జతకట్టడానికి ముందు పీఎం నరేంద్ర మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌కు పూర్తి సమయం ప్రచారకర్త లేదా ప్రచారక్ గా పనిచేశారు.
  5. నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి తెలుసు. అప్పట్లో ఆయన లక్ష్మణరావు ఇనామ్‌దార్‌ను కలుసుకున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ లో ప్రధాని మోడీని జూనియర్ క్యాడెట్‌గా చేర్చారు.
  6. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నియమితులైనప్పుడు, ఆయన రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు.
  7. ఇందిరా గాంధీ తర్వాత వరుసగా రెండోసారి స్పష్టమైన మెజారిటీతో బాధ్యతలు చేపట్టింది ప్రధాని నరేంద్ర మోదీయే..
  8. పద్యాలు రాయడం, ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడే ప్రధాని నరేంద్ర మోదీ.. పలు పుస్తకాలు ప్రచురించారు. ఆయన ఫోటోగ్రఫీపై చాలా మక్కువ కలిగి ఉంటారు. మోడీ తీసిన ఛాయాచిత్రాలను ప్రదర్శనలో సైతం ప్రదర్శించారు.
  9. ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో 2018లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ప్రధాని మోదీ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..