Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు.. ఇళ్లు తగలబెట్టిన ముష్కరులు.. 9 మంది మృతి..

మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. సోమవారం అర్ధరాత్రి ఇంఫాల్ తూర్పు జిల్లా, కంగ్‌పోక్పీ జిల్లాలకు సరిహద్దులో ఉన్న ఖమెన్‌లోక్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు.. ఇళ్లు తగలబెట్టిన ముష్కరులు.. 9 మంది మృతి..
Manipur

Updated on: Jun 14, 2023 | 3:08 PM

మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. సోమవారం అర్ధరాత్రి ఇంఫాల్ తూర్పు జిల్లా, కంగ్‌పోక్పీ జిల్లాలకు సరిహద్దులో ఉన్న ఖమెన్‌లోక్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి అర్ధరాత్రి 1.00 AM గంటలకు కొంతమంది ముష్కరులు అధునాతన ఆయుధాలతో ఖమెన్‌లోక్ గ్రామాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో గ్రామ వాలంటీర్లు, ముష్కరుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ముష్కరులు ఆ గ్రామంలోని పలు ఇళ్లను కూడా తగలబెట్టడం కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారని.. ఐదుగురు గాయపడ్డారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా చెలరేగిన ఘర్షణలతో ఇంఫాల్ ఇప్పటివరకు కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుకు కోత పడింది. మళ్లీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం మణిపుర్‌లో మెయిటీలు, కూకీ వర్గాల మధ్య అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీ వర్గ ప్రజలు డిమాండ్ చేయడంతో వీరికి వ్యతిరేకంగా కూకీ వర్గ ప్రజలు ఆందోళనలు చేశారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మంది చనిపోగా.. 310 మంది గాయాలపాలయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.