పంజాబ్‌లో విషాదం, గ్యాస్ లీకై 9 మంది మృతి..11 మందికి అస్వస్థత

పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. లుదియానా జిల్లా గియాస్పురలో ఓ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో 9 మంది చనిపోయారు. మరో 11 మంది అస్వస్థకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

పంజాబ్‌లో విషాదం, గ్యాస్ లీకై 9 మంది మృతి..11 మందికి అస్వస్థత
Punjab

Updated on: Apr 30, 2023 | 11:21 AM

పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. లుదియానా జిల్లా గియాస్పురలో ఓ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో 9 మంది చనిపోయారు. మరో 11 మంది అస్వస్థకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే పాల ఉత్పత్తులు చేసే గోయల్ మిల్క్ ప్లాంట్ అనే ఫాక్టరీలో ఉదయం 7.15 గంటలకు ఉన్న కూలింగ్ సిస్టమ్ లో గ్యాస్ లీకైనట్లు ఓ నివేదిక తెలిపింది. ఆ గ్యా్స్ లీకైన అనంతరం దానికి 300 మీటర్ల రేడియస్ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినట్లు పేర్కొంది.

అయితే ప్రస్తుతం అస్వస్థకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నవారిని సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు కోరారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రమాదానికి గురైన వారికి సహాయం చేస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.