Uttarakhand: ఘోర ప్రమాదం.. నదిలో కొట్టుకుపోయిన పర్యాటకుల కారు.. 9 మంది మృతి..

|

Jul 08, 2022 | 10:51 AM

ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఒక బాలికను రక్షించారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది.

Uttarakhand: ఘోర ప్రమాదం.. నదిలో కొట్టుకుపోయిన పర్యాటకుల కారు.. 9 మంది మృతి..
Ramnagar Car Drown Accident
Follow us on

Ramnagar Car Drown Accident: ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రామ్‌నగర్‌లో పర్యాటకులతో వెళ్తున్న కారు ఉధృతంగా ప్రవహిస్తున్న ధేలా నదిలో నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఒక బాలికను రక్షించారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించి 9 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు కుమావోన్ రేంజ్ డీఐజీ ఆనంద్ భరన్ తెలిపారు.

మరో ఐదుగురు కూడా నదిలో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రెస్క్యూ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహించడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ఢెలా జోన్‌లో రామ్‌నగర్‌ – కోట్‌ద్వార్‌ రోడ్‌ మధ్యలో జరిగింది. పంజాబ్‌కు చెందిన 11 మంది ఎర్డీగా కారులో ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి బయలుదేరినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి


కాగా, శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు రాంనగర్‌లోని ధేలా నది సమీపంలోకి చేరుకుంది. భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అయినప్పటికీ.. డ్రైవర్ పట్టించుకోకుండా వంతెన దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో భారీ ప్రవాహం కారణంగా పర్యాటకుల కారు నదిలో కొట్టుకుపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..