
డిజిటల్ అరెస్ట్.. అనే మాటే లేదు.. అదంతా కట్టుకథే.. నమ్మోద్దు.. అని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు.. డిజిటల్ అరెస్ట్ అని.. నమ్మి చాలా మంది కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్నారు.. ముఖ్యంగా చదువుకున్న ఉన్నత విద్యావంతులు.. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్లు, ఇతరులు సైతం నమ్మి మోసాల బారిన పడుతున్నారు. తాజాగా.. అతి పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ.. రిటైర్డ్ టీచర్‌ను బెదిరించి రూ. 24 కోట్లు స్వాహా చేశారు సైబర్ క్రిమినల్స్.. 74 ఏళ్ల లక్ష్మి రామమూర్తిని ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట సైబర్ బుఠా బురిడీ కొట్టించింది. సీబీఐ, ఈడీ అధికారులమంటూ భయపెట్టి 26 లావాదేవీలతో రూ. 24 కోట్లను కేటుగాళ్లు నొక్కేశారు. మరింత సొమ్ము కోసం 1.30 కిలోల బంగారం తాకట్టు పెట్టేందుకు వెళ్లగా.. గుర్తించిన బ్యాంక్ మేనేజర్.. అలర్ట్ అయ్యారు. బాధితురాలి భయాన్ని గమనించి ప్రశ్నించడంతో భారీ సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్ చొరవతో సీసీబీ సైబర్ పోలీసులకు రామమూర్తి ఫిర్యాదు చేశారు.
శివాజీనగరకు చెందిన లక్ష్మీ రామమూర్తి(70) ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడగా ఇక్కడ ఆమె ఒక్కరే ఇక్కడ నివసిస్తున్నారు. ఇటీవల ఆస్తులు విక్రయించగా వచ్చిన నగదును బ్యాంకు ఖాతాలోనే ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన కేటుగాళ్లు జనవరిలో ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని, అందుకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని లక్ష్మీ రామమూర్తిని బెదిరించారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.24 కోట్లను దశల వారీగా బదిలీ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు ఇస్తేనే విడిచి పెడతామని.. వెధిస్తుండటంతో.. లక్ష్మీ రామమూర్తి ఇంట్లో ఉన్న 1.30 కిలోల బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో బ్యాంక్ మేనేజర్ ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పారు.
ఫిర్యాదు అనంతరం రంగంలోకి దిగిన కర్ణాటక సైబర్ కమాండ్ యూనిట్.. రూ. 3 కోట్ల బదిలీని ఆపింది. దేశవ్యాప్తంగా నిందితుల అకౌంట్లను ఫ్రీజ్ చేసి పోలీసులు రూ. 5.46 కోట్లు రికవరీ చేశారు. తమిళనాడు, ముంబై, గుజరాత్, ఢిల్లీ, బిహార్‌లకు చెందిన ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబైకి చెందిన ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు అనుచరులను అరెస్ట్ చేశారు. నిందితుల అకౌంట్ల నుంచి రూ. 60 లక్షలు జప్తు.. మరో 22 ఖాతాలపై పోలీసుల నిఘా పెట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..