విదేశాల్లోని జైళ్లలో భారతీయ ఖైదీలు ఎంత మంది ఉన్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో దాదాపు 7,139 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. 2020 డిసెంబర్ 31 వరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం 7,139 మంది భారతీయులు విదేశాల్లోని జైళ్లల్లో ఖైదీలుగా ఉన్నారని పేర్కొంది. ఇందులో కోర్టు విచారణను ఎదుర్కొంటున్నవారు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా సౌదీ ఆరేబియాలో 1,599 మంది, యూఏఈలో 898 మంది, నేపాల్‌లో 886 మంది, మలేషియలో 548 మంది, కువైట్‌లో 536 మంది జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపింది. అయితే చాలా దేశాల్లో స్థానిక చట్టాలకు లోబడి, జైళ్లలోని ఖైదీల వివరాలను బయటకు వెల్లడించడం లేదని కేంద్రం తెలిపింది.
Second Dose Vaccine: ఫిబ్రవరి 13 నుంచి కరోనా వ్యాక్సిన్ రెండో డోసు: కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి