Baby Care Center Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు.. మరికొందరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు శిశువులు మృతి చెందగా.. మరో ఆరుగురు శిశువులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. 12 మంది నవజాత శిశువుల్ని రక్షించారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. చిన్నారుల మృతి తల్లిదండ్రులు కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.. హాస్పిటల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శనివారం రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే తొమ్మిది ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పంపామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. ఇంతలో, DFS చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని.. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
12 మంది నవజాత శిశువులను రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. వీరిలో 6 మంది మృతి చెందగా, ఒకరు వెంటిలేటర్‌పై, ఐదుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.
#UPDATE | A total of 12 children were rescued, out of which 6 have died, 1 is on the ventilator and 5 others are admitted to the hospital: Delhi Fire Service
A massive fire broke out at a New Born Baby Care Hospital in Vivek Vihar late last night. https://t.co/byEpTHfopm
— ANI (@ANI) May 26, 2024
బేబీ కేర్ సెంటర్ వివేక్ విహార్‌లోని B బ్లాక్‌లో బేబీ కేర్ సెంటర్ అని అతుల్ గార్గ్ చెప్పారు. నవజాత శిశువులను రక్షించి అంబులెన్స్‌లో చికిత్స కోసం తూర్పు ఢిల్లీ అడ్వాన్స్‌డ్ ఎన్‌ఐసియు ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ప్రమాదం జరగడంతో చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆస్పత్రి యాజమాన్యం ఇంకా స్పందించలేదు..
ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. 11.32 గంటలకు ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి నడుస్తున్న భవనం, సమీపంలోని నివాస భవనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక దళం బృందం మంటలను ఆర్పింది. ఓ పోలీసు అధికారి ఆస్పత్రి సిబ్బంది నుంచి ప్రమాదంపై సమాచారం సేకరిస్తున్నారు. ఆసుపత్రిలో అగ్నిమాపక వ్యవస్థ ఉందా లేదా అని కూడా ఆరా తీస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..