Cubs: అయ్యో.. 15 రోజుల్లోనే ఏడు చిరుత కూనలు మృతి.. ఏం జరిగిందంటే ?

|

Sep 19, 2023 | 7:33 PM

కర్ణాటకలోని బన్నెరఘట్ట బయోలాజికల్‌ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ చిరుత కూనల మరణించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ పార్కులో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏడు చిరుత కూనలు మృత్యువాతపడటం ఆందోళన కలగిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన ‘ఫీలైన్‌ పాన్ల్యూకోపెనియా అనే అంటువ్యాధి బారిన పడి అవి చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనే వాటికి ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ఉండేదుకు టీకాలు వేయించారు.

Cubs: అయ్యో.. 15 రోజుల్లోనే ఏడు చిరుత కూనలు మృతి.. ఏం జరిగిందంటే ?
Cubs
Follow us on

కర్ణాటకలోని బన్నెరఘట్ట బయోలాజికల్‌ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ చిరుత కూనల మరణించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ పార్కులో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏడు చిరుత కూనలు మృత్యువాతపడటం ఆందోళన కలగిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన ‘ఫీలైన్‌ పాన్ల్యూకోపెనియా అనే అంటువ్యాధి బారిన పడి అవి చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనే వాటికి ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ఉండేదుకు టీకాలు వేయించారు. అయినప్పటికీ కూడా ఆ ప్రమాదకమైన వైరస్‌ సోకిందని.. ఆ తర్వాత అవి చికిత్స పొందుతూ మరణించినట్లు పార్కు అధికారులు పేర్కొన్నారు. తాము తొమ్మిది చిరుతపులి పిల్లలను సఫారీ ప్రాంతంలో విడిచిపెట్టామని చెప్పారు. అయితే వాటిలో నాలుగు.. ఆ వైరస్‌ బారినపడి చనిపోయినట్లు పేర్కొన్నారు.

అయితే రెస్క్యూ సెంటర్‌లోని మరో మూడు కూనలకు కూడా ఈ వైరస్‌ సోకినట్లు తెలిపారు. ఆ తర్వాత వాటికి సరైన చికిత్స అందించారని అయినా కూడా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చనిపోయిన కూనల వయసు కేవలం మూడు నుంచి ఎనిమిది నెలల మధ్యే ఉందని తెలిపారు. అయితే ఆగస్టు 22వ తేదీన ఈ వైరస్‌ వ్యాప్తిని మొదటగా గుర్తించినట్లు ఆ పార్కు ఈడీ వెల్లిడించారు. అయితే ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని తెలిపారు. మరోవైపు వైరస్‌ కట్టడి కోసం అవసరమైనటువంటి అన్ని చర్యలనూ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే మరోవైపు సీనియర్ పశువైద్యులను కూడా సంప్రదించినట్లు తెలిపారు. అలాగే జూ పార్కులో పరిశుభ్రత చర్యలు చేపట్టామని.. రెస్క్యూ సెంటర్‌ను కూడా పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిపారు.

మరోవైపు ఈ ‘ఫీలైన్‌ పాన్ల్యూకోపెనియా’ అనే వైరల్‌ అంటువ్యాధి గురించి అధికారులు వివరించారు. వాస్తవానికి ఈ వైరస్ ‘పార్వోవైరస్’ వల్ల కలుగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు పిల్లి జాతులపైనా ఈ వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ఈ వైరస్ బారిన పడితే.. దాని జీర్ణ వ్యవస్థ పూర్తిగా ప్రభావితమైతుందన్నారు. అలాగే తీవ్రమైన విరేచనాలు రావడం, వాంతులు రావడం అలాగే డీహైడ్రేషన్‌ కలగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఇక చివరికి ఇవి మరణానికి దారితీస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుందని.. సరైన చికిత్స అనేది అందనట్లైతే ఈ వైరస్‌ సోకిన జంతువులు కేవలం నాలుగైదు రోజుల్లోనే చనిపోతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆ పిల్లి కూనలు చనిపోయడం ఇప్పుడు కర్ణాటకలో చర్చనీయాంశమవుతోంది. జంతువులను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని జంతు ప్రేమికులు సూచనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం