జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. భక్తులు బస్సులో అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తుండగా.. జమ్మూ -శ్రీనగర్ నేషనల్ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి జమ్మూలోని జజ్జర్ కోట్లి కురుబూరు వంతెన పైనుంచి వాగులో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న CRPF, పోలీసులు, ఇతర అధికార బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కింద ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో క్రేన్‌ను ఇక్కడకు తెస్తున్నామని.. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని CRPF అసిస్టెంట్ కమాండెంట్ అశోక్ చౌదరి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
బస్సు అమృత్‌సర్ నుంచి వస్తోందని, బీహార్‌కు చెందిన దీనిలో ఉన్నారని పేర్కొన్నారు. వైష్ణో దేవి ఆలయానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొంటున్నారు.
#WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries.
Visuals from the spot. pic.twitter.com/iSse58ovos
— ANI (@ANI) May 30, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..