యూపీలో ఘోర ప్రమాదం.. ప్రయాణీకులపైకి దూసుకెళ్లిన రైలు

ఉత్తర్‌ప్రదేశ్‌ మీర్జాపూర్‌లోని చునార్‌ రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చోపాన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగి పట్టాలు దాటుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

యూపీలో ఘోర ప్రమాదం.. ప్రయాణీకులపైకి దూసుకెళ్లిన రైలు
Rail Accident

Updated on: Nov 05, 2025 | 12:52 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ మీర్జాపూర్‌లోని చునార్‌ రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చోపాన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగి పట్టాలు దాటుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందినట్లు తెలుస్తోంది. కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ముగించుకుని చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

అసలు జరిగిందిదే..

యాత్రికులు అందరూ కూడా చోపాన్-ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో చునార్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం రైలు దిగి పట్టాలపై నుంచి మరో ప్లాట్‌ఫాం మీదకు వెళ్తుండగా.. వేగంగా ట్రాక్‌పైకి వచ్చిన హౌరా-కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్ యాత్రికులను డీకొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.