దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉత్తర భారతంలోనే ఎక్కువగా జరిగిన ఈ ఆందోళనలు.. క్రమేపి దక్షిణ భారతంలో కూడా ఊపందుకుంటున్నాయి. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. అయితే ఈ సభలో మహారాష్ట్రకి చెందిన ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారీస్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర్యం అన్నది అడుక్కుంటే వచ్చేది కాదని అన్నారు. మేం కేవలం 15కోట్ల మందిమే ఉన్నాం కానీ.. మీ 100కోట్లమందిపై ఆధిపత్యం చూపగలం అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేల్చుకుందామా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే పఠాన్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో.. అదే వేదికపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు.
కాగా, గతంలో ఓవైసీ సోదరుడు అక్బరుద్ధీన్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో 15నిమిషాలు గడువిచ్చి.. పోలీసులని పక్కకి తప్పిస్తే మేమేంటో చూపిస్తామంటూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత అరెస్ట్, షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. మరోసారి కేసు నమోదైంది. అయితే ఇప్పుడు వారిస్ పఠాన్ కూడా.. అక్బరుద్దీన్ తరహాలోనే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రకి చెందిన బీజేపీ నేత పరిమల్ దేశ్ పాండే పుణేలోని డెక్కన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
#WATCH AIMIM leader Waris Pathan: …They tell us that we’ve kept our women in the front – only the lionesses have come out&you’re already sweating. You can understand what would happen if all of us come together. 15 cr hain magar 100 ke upar bhaari hain, ye yaad rakh lena.(15.2) pic.twitter.com/KO8kqHm6Kg
— ANI (@ANI) February 20, 2020
Maharashtra: Parimal Deshpande, a BJP worker from Pune has filed a written complaint at Deccan Police Station against AIMIM leader Waris Pathan on his statement,”15 crore hain magar 100 ke upar bhaari hain, ye yaad rakh lena”. https://t.co/RV8gRLFjSx pic.twitter.com/Nd6x5xflmR
— ANI (@ANI) February 20, 2020