Earthquake: భారీ భూప్రకంపనలతో వణికిపోయిన ఈశాన్య రాష్ట్రాలు.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు

Magnitude Earthquake: భారీ భూప్రకంపనలతో ఉత్తర భారతదేశం వణికిపోయింది. అసోం, మేఘాలయా, ఉత్తర బెంగాల్‌లో గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో

Earthquake: భారీ భూప్రకంపనలతో వణికిపోయిన ఈశాన్య రాష్ట్రాలు.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు
Eearthquake

Updated on: Jul 07, 2021 | 11:36 AM

Magnitude Earthquake: భారీ భూప్రకంపనలతో ఉత్తర భారతదేశం వణికిపోయింది. అసోం, మేఘాలయా, ఉత్తర బెంగాల్‌లో గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో భూప్రకంనలు సంభవించాయి. ఈ భూ కంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం మేఘాలయాలోని తురాకు ఉత్తరాన 71 కిలోమీటర్ల దూరం, భూమికి 14 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది. దీంతో అస్సాం, గోల్‌పారా, మెఘాలయా, ఉత్తర బెంగాల్, డార్జిలింగ్, కూచ్ బెహార్ వంటి ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు సంభవించాయి. దీంతోపాటు బంగ్లాదేశ్‌లో కూడా ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా ప్రకంపనలు రావడంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అందరూ భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే నష్టానికి సంబంధించిన నివేదికలు అందలేదని విపత్తు అధికారులు తెలిపారు. కాగా.. రెండు రోజుల కిందట హర్యానా ఝాజ్జర్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల ప్రభావం ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కనిపించాయి. ఉత్తర భారతదేశంలో తరచూ భూ కంపాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఢిల్లీ, యూపీ, బీహార్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

Also Read:

Mysterious Village: భూమిపైనే అల్లంత దూరాన మేఘాల్లో గ్రామం.. వర్షం చుక్క ఎరుగని ఊరు.. ఇదెక్కడంటే..!?

Handwara Encounter: హింద్వారాలో ఎన్‌కౌంటర్.. టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం