బ్రేకింగ్‌..మిజోరాంలో భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 5.1 గా నమోదు..

| Edited By:

Jun 21, 2020 | 5:52 PM

ఓ వైపు కరోనాతో దేశం మొత్తం వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ప్రజల్ని గజగజ వణికిస్తోంది. మొన్నటి వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురిసి ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తగా..

బ్రేకింగ్‌..మిజోరాంలో భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 5.1 గా నమోదు..
Earthquake
Follow us on

ఓ వైపు కరోనాతో దేశం మొత్తం వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ప్రజల్ని గజగజ వణికిస్తోంది. మొన్నటి వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురిసి ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తగా.. మరోవైపు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆదివారం మిజోరాంలో భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై 5.1గా నమోదైంది. ఐజ్వాల్‌కు ఈశాన్యం దిశగా 25 కిలో మీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4.16 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలాజీ తెలిపింది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు జూన్ 18వ తేదీన కూడా రాత్రి 7.29 గంటలకు మిజోరాంలోని చంపై ప్రాంతంలో భూకంపం వచ్చింది. అప్పుడు రిక్టార్ స్కేల్‌పై 5.0గా నమోదైంది.