బ్లాకులో ప్రాణవాయువు, ఢిల్లీలో ఓ వ్యక్తి ఇంటినుంచి 48 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం. అరెస్ట్

| Edited By: Anil kumar poka

Apr 24, 2021 | 9:29 AM

సెకండ్  కోవిడ్ మహమ్మారి కోరలు చేస్తున్న వేళ..అసలే దేశం ఆక్సిజన్ కొరతతో అల్లల్లాడుతుండగా ఓ వ్యక్తి తన ఇంట్లో 48 సిలిండర్లను దాచుకున్నాడు. పోలీసులకు ఈ సమాచారం తెలిసి...

బ్లాకులో ప్రాణవాయువు, ఢిల్లీలో ఓ వ్యక్తి ఇంటినుంచి 48 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం. అరెస్ట్
48 oxygen cylinders seized from delhi second covid wave
Follow us on

సెకండ్  కోవిడ్ మహమ్మారి కోరలు చేస్తున్న వేళ..అసలే దేశం ఆక్సిజన్ కొరతతో అల్లల్లాడుతుండగా ఓ వ్యక్తి తన ఇంట్లో 48 సిలిండర్లను దాచుకున్నాడు. పోలీసులకు ఈ సమాచారం తెలిసి అతని ఇంటిపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 32 పెద్ద సిలిండర్లు ఉండగా …చిన్నవి 16 ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ బిజినెస్ చేసే 51 ఏళ్ళ అనిల్ కుమార్ అనే ఈ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తన బిజినెస్ కి ఇతగాడు ఎలాంటి లైసెన్స్ చూపలేదని పోలీసులు తెలిపారు. చిన్న సిలిండర్లను అనిల్ కుమార్  12,500 రూపాయలకు అమ్ముతూ వచ్చాడని  తెలిసింది. పెద్ద వాటి నుంచి ఈ చిన్నవాటిలోకి ఆక్సిజన్ ని నింపి ఇలా అమ్మేవాడని ఖాకీలు చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఆక్సిజన్ సిలిండర్లను కోర్టు ఉత్తర్వులపై వివిధ ఆసుపత్రులకు అందజేస్తామని వారు తెలిపారు. దేశంలో ఇప్పటికే విమానాలు,  రైళ్లు, రోడ్డు మార్గాల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. అనేక ఆసుపత్రులు సిలిండర్ల కోసం పరితపిస్తున్నాయి.

మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల బయటే  చికిత్సలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ వ్యక్తి  దర్జాగా  తన ఇంట్లో ఇన్ని ఆక్సిజన్ సిలిండర్లను దాచుకోవడం పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది.