అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు, క్రూరమృగాలు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తరచూ పులులు, ఎలుగుబంట్లు, కొండచిలువలు వంటివి తరచూ గ్రామాలపై పడుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఏపీ రాష్ట్రం తిరుపతిలో నడకదారిలో ఓ చిన్నారిపై చిరుత దాడిచేసి చంపేసిన ఘటన అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది. తాజాగా అలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలికను చిరుతపులి లాక్కెళ్లి చంపింది. బాలిక మృతదేహం 2 కి.మీ దూరంలో లభ్యం కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. గత శనివారం రాత్రి 7-8 గంటల ప్రాంతంలో 4 ఏళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసింది .
Udhampur, J&K | Between 7-8pm, a 4-year-old girl was taken away by a leopard. As we got the information, we dispatched teams from Udhampur control room. We’re here to ensure that such incidents don’t occur in the future. This is a very unfortunate incident, and we will do all the… pic.twitter.com/gabR7L4Tcs
ఇవి కూడా చదవండి— ANI (@ANI) September 3, 2023
జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం జోనల్ అధికారి రాకేష్ శర్మ, ఉధంపూర్ జిల్లాలోని పంచారి తహసీల్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్టుగా చెప్పారు. బాలికను చిరుత ఎత్తుకెళ్లిన సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్ర వన్యప్రాణి విభాగం సంఘటనా స్థలానికి చేరుకుని వెతకడం ప్రారంభించింది. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. చివరకు బాలిక మృతదేహం లభ్యమైందని, చనిపోయిన చిన్నారి తనుగా గుర్తించామని శర్మ తెలిపారు.
తెల్లవారుజామున, రాత్రి వేళల్లో జంతువులు సంచరించేందుకు అనువైన సమయమని మహిళలు, పిల్లలు, పెద్దలు ఒక్కొక్కరుగా బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతపులిని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా వివరించారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా పరిహారం అందజేస్తామని అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే, తిరుమల నడకదారిలో వరుస చిరుత దాడుల నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు ప్రత్యేక సూచనలు చేసింది టీటీడీ. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు వెళ్లాలని సూచించారు. ఈ మేరకు ఎక్కడికక్కడ మైక్‌ల ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నడక మార్గంలో భక్తుల భద్రత మేరకు అవసరమైన చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..