Train Accident in Bihar: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ఐదు కోచ్‌లు..

|

Oct 12, 2023 | 7:19 AM

North East Express Train Accident in Bihar: బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి భారీ రైలు ప్రమాదం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి వస్తున్న 12506 ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12506లోని ఐదు కోచ్‌లు బక్సర్ జిల్లా సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

Train Accident in Bihar: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ఐదు కోచ్‌లు..
North East Express Train Accident In Bihar
Follow us on

బీహార్, అక్టోబర్ 12: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి భారీ రైలు ప్రమాదం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి వస్తున్న 12506 ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12506లోని ఐదు కోచ్‌లు బక్సర్ జిల్లా సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి కామాఖ్య వరకు నడుస్తున్న రైలు నంబర్ 12506 నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని 5 కోచ్‌లు బుధవారం రాత్రి బీహార్‌లోని బక్సర్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. దానాపూర్ రైల్వే డివిజన్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో 12506 నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారి తెలిపారు.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్య వరకు నడుస్తున్న రైలు నంబర్ 12506 నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లు బుధవారం రాత్రి 9.35 గంటలకు దానాపూర్ డివిజన్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయని తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే వైద్యబృందం, అధికారులతో ప్రమాద సహాయ వాహనం ఘటనా స్థలానికి బయలుదేరిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి