మసీదులో పేలిన ఐఈడీ.. ఇమామ్‌ సహా..

ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని కాబుల్ ప్రాంతంలో శుక్రవారం నాడు పేలుడు సంభవించింది.

మసీదులో పేలిన ఐఈడీ.. ఇమామ్‌ సహా..

Edited By:

Updated on: Jun 12, 2020 | 4:38 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని కాబుల్ ప్రాంతంలో శుక్రవారం నాడు పేలుడు సంభవించింది. కాబుల్‌కు పశ్చిమంలో ఉన్న షేర్‌ షా సురీ మసీదులో శుక్రవారం ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ఐఈడీ బాంబ్‌ బ్లాస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వీరిలో మసీదు షేర్‌ షా సురీ మసీదు ఇమామ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఏ ఉగ్రసంస్థ అన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదని ఆఫ్ఘన్‌ అధికారులు తెలిపారు.