Covid-19 hospital: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కోవిడ్-19 ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నాగ్‌పూర్ వాడి ప్రాంతంలోని కోవిడ్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి రెండో అంతస్తులోని కోవిడ్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వార్డు మొత్తం మంటలు వ్యాపించాయని.. అయితే మంటలు రెండో అంతస్తుకే పరిమితమయ్యాయని అధికారులు తెలిపారు.
భవనంలోని మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్లు నాగ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర ఉచ్కే పేర్కొన్నారు. సమాచారం అందగానే.. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న 27 మంది కరోనా బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించారు.
కాగా.. ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. నాగ్‌పూర్ ప్రమాద ఘటన విచారకరం. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు అండగా ఉంటాం.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. అంటూ మోదీ పేర్కొన్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ప్రమాదంపై ట్విట్టర్‌లో స్పందించారు. నాగ్‌పూర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసి చాలా బాధేసింది.. వెంటనే కలెక్టర్‌తో మాట్లాడాను.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. అంటూ ఆయన ట్విట్ చేశారు.
Maharashtra: A fire broke out at a COVID hospital in Nagpur
“Around 27 patients at the hospital were shifted to other hospitals. We can’t comment on their health condition now. Hospital has been evacuated,” says police pic.twitter.com/YfGd9p4Xjh
— ANI (@ANI) April 9, 2021
Also Read: