లడఖ్‌ లో 4.3 తీవ్రతతో భూకంపం… భారత్‌- చైనా బార్డర్‌లో భూకంప కేంద్రం..

|

Mar 28, 2023 | 6:25 PM

మంగళవారం ఉదయం, ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది , ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో భయాందోళనకు గురైన నివాసితులు తమ భవనాల నుండి బయటకు వచ్చారు.

లడఖ్‌ లో 4.3 తీవ్రతతో భూకంపం... భారత్‌- చైనా బార్డర్‌లో భూకంప కేంద్రం..
Earthquake
Follow us on

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో మంగళవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగినట్లు తెలియలేదు. భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో 105 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, మంగళవారం మొత్తం పలు ప్రాంతాల్లో కలిపి మూడుసార్లు భూమి కంపించింది. మంగళవారం ఉదయం, ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది , ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో భయాందోళనకు గురైన నివాసితులు తమ భవనాల నుండి బయటకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

బలమైన ప్రకంపనల కారణంగా ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, చండీగఢ్, జైపూర్ మరియు ఇతర నగరాల్లో వందలాది మంది ప్రజలు తమ ఇళ్ల నుండి వీధుల్లోకి పరుగులు తీశారు. పాకిస్తాన్‌లో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు తొమ్మిది మంది మరణించినట్టుగా తెలిసింది. 160 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ..