Covid Third Wave: కోవిడ్ మూడో దశ రాబోతోంది.. ఎదుర్కొనేందుకు సిద్దంకండి: కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌

|

May 06, 2021 | 9:20 AM

Covid Third Wave: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు,.

Covid Third Wave: కోవిడ్ మూడో దశ రాబోతోంది.. ఎదుర్కొనేందుకు సిద్దంకండి: కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌
Follow us on

Covid Third Wave: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో కరోనా వైరస్‌ మూడో దశ రాబోతోందని, దానిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కె. విజయరాఘవన్‌ అన్నారు. దేశంలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ అనివార్యమైంది.. అని ఆయన అన్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయరాఘవన్‌ మాట్లాడారు. కరోనా మూడో దశ అనివార్యం. ఈ మూడో దశ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం వేరియంట్‌లకు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా కొత్త వేరియంట్లు నమోదవుతున్నాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయని ఆయన అన్నారు. రోగనిరోధకాలు వ్యాధి తీవ్రతను తగ్గించేవిగా లేదా పెంచేవిగా మారే అవకాశం ఉందన్నారు. దీంతో థర్ఢ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి అని ఆయన సూచించారు.

అయితే కరోనా సెకండ్ వేవ్‌లో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. ఇందుకోసం పలు రాష్ట్రాలు తాము ఉచితంగానే టీకాలు వేస్తామని ప్రకటనలు చేశాయి. భారత్‌లో ఈ సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడంతో భయాందోళన నెలకొంది. ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ విధిస్తుండగా, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ సైతం విధిస్తున్నాయి. మొదటి వేవ్‌లో కంటే ఈ సెకండ్‌వేవ్‌లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో మరింత టెన్షన్‌ మొదలైంది. అయితే పాజిటివ్‌ కేసులు నమోదు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశం.

ఇవీ చదవండి:

Telangana: తెలంగాణ‌లోని ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు స్వచ్చందంగా లాక్‌డౌన్‌.. తీర్మానాన్ని అతిక్ర‌మిస్తే 5వేలు జ‌రిమానా

Corona Rapidly Expanding: దేశంలోనే అత్యధిక ప్రమాదకరంగా ఆ 30 జిల్లాలు.. అందులో 7 మనవే…