Covid-19: పెరుగుతున్న కరోనా కేసులు.. మూడు వారాల్లో 36 శాతం పెరుగుదల.. జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్‌డౌన్‌ తప్పదు.!

|

Feb 22, 2021 | 9:29 PM

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశం మొత్తంగా కరోనా మహమ్మారి అదుపులో వస్తుందనుకునే సమయంలో ...

Covid-19: పెరుగుతున్న కరోనా కేసులు.. మూడు వారాల్లో 36 శాతం పెరుగుదల.. జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్‌డౌన్‌ తప్పదు.!
COVID
Follow us on

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశం మొత్తంగా కరోనా మహమ్మారి అదుపులో వస్తుందనుకునే సమయంలో మహారాష్ట్రలో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి నుంచే అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. ముంబైలో గత మూడు వారాల్లో 36 శాతం కేసులు పెరిగినట్లు బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ప్రజల నిర్లక్ష్యంతో పాటు లోకల్‌ రైళ్ల అనుమతి, హోటళ్లు, మాల్స్‌, తదితర రంగాలు తెరుచుకోవడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేష్‌ తెలిపారు. కరోనా ఆంక్షలు సడలించడంతో వివిధ కార్యక్రమాలు ఎక్కువైపోయాయని, పాజిటివ్‌ వచ్చిన చాలా మందిలో లక్షణాలు కనిపించకపోవడంతో ఈ పరిస్థితి తయారైందని అన్నారు.

మరో వైపు అమరావతిలో 47 శాతం, యావత్మల్‌లో 48 శాతం, నాగ్‌పూర్‌లో 33 శతం, నాసిక్‌లో 23 శాతం, అకోలాలో 55 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,00,884 చేరింది. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరిత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే రాబోయే రెండు వారాల్లో లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

Also Read:

Corona Cases Telangana: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే

CCMB Study: షాకింగ్‌ న్యూస్‌.. భారత్‌లో 7,569 కరోనా వైరస్‌ రకాలు.. సీసీఎంబీ పరిశోధనలలో వెల్లడి