Covid-19 India: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Coronavirus Updates in India: దేశంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ..

Covid-19 India: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona

Updated on: Aug 18, 2021 | 9:53 AM

Coronavirus Updates in India: దేశంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. సోమవారం భారీగా తగ్గిన కేసులు.. మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) 35,178 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 440 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,85,857 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,32,519 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. మంగళవారం నమోదైన కేసులతో పోల్చుకుంటే.. 40 శాతం కేసులు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

గత 24 గంటల్లో 37,169 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు మొత్తం 3,22,85,857 మంది కోలుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,67,415 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 56,06,52,030 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

దేశంలో నిన్న 17,97,559 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 49,84,27,083 కోవిడ్ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.

Also Read:

Neem Leaves Benefits: రుచిలోనే చేదు.. ఆరోగ్య ప్రయోజనాల్లో రారాజు.. వేపాకు లాభాలు తెలిస్తే షాకే..

Garlic Tea Benefits: వెల్లుల్లి టీ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు..

Tulsi Leaves Benefits: తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు.. పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా మేలే..