బ్రేకింగ్ : జమ్మూలో పెను విషాదం.. 33 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మిని బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు 33 మంది మృతి చెందారు. మరొ 22 మంది తీవ్రగాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కేశ్వాన్ నుంచి కిష్టావర్‌కు వెళ్తుండగా ఉదయం 7.30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. […]

బ్రేకింగ్ : జమ్మూలో పెను విషాదం.. 33 మంది మృతి

Updated on: Jul 01, 2019 | 10:47 AM

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మిని బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు 33 మంది మృతి చెందారు. మరొ 22 మంది తీవ్రగాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కేశ్వాన్ నుంచి కిష్టావర్‌కు వెళ్తుండగా ఉదయం 7.30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిర్గ్‌వారీ ప్రాంతంలో మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో బస్సు లోయలో పడినట్లు అధికారులు వెల్లడించారు.

బస్సు ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us