Indians Trafficking: కాంబోడియాకు భారతీయుల అక్రమ రవాణా.. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల మహిళలు..

|

Jul 09, 2024 | 7:42 PM

Indians Trafficked To Cambodia: చైనా సైబర్‌ నేరగాళ్లు మరింత బరి తెగించారు. భారతీయ మహిళలను కాంబోడియాకు అక్రమ రవాణా చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. అంతేకాకుండా భారతీయ మహిళలతో స్వదేశంలో ఉన్న వాళ్లకు న్యూడ్‌ కాల్స్‌ చేయిస్తూ హానీట్రాప్‌ చేస్తున్నారు. అలా న్యూడ్‌ కాల్స్‌తో డబ్బులు వసూలు చేస్తున్నారు.

Indians Trafficking: కాంబోడియాకు భారతీయుల అక్రమ రవాణా.. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల మహిళలు..
Indians Trafficked To Cambodia
Follow us on

Indians Trafficked To Cambodia: చైనా సైబర్‌ నేరగాళ్లు మరింత బరి తెగించారు. భారతీయ మహిళలను కాంబోడియాకు అక్రమ రవాణా చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. అంతేకాకుండా భారతీయ మహిళలతో స్వదేశంలో ఉన్న వాళ్లకు న్యూడ్‌ కాల్స్‌ చేయిస్తూ హానీట్రాప్‌ చేస్తున్నారు. అలా న్యూడ్‌ కాల్స్‌తో డబ్బులు వసూలు చేస్తున్నారు. చైనా సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాల్లో భారతీయులను టార్గెట్‌ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యూత్‌ను ట్రాప్‌ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగాల పేరుతో కాంబోడియా రాజధాని నామ్‌ఫెన్‌కు తరలిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయుల దగ్గర డబ్బులు వసూలు చేసి అడ్డమైన పనులు చేయిస్తున్నారు. ప్రకాశ్‌ అనే తెలుగు యువకుడు కాంబోడియాలో ఇలాగే చిక్కుకుపోయాడు. తమిళనాడులో ఉన్న తన సోదరికి సెల్ఫీ పంపి బాధను వెల్లడించాడు. భారత ఎంబసీ సాయంతో అతడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే కాంబోడియాలో ఇంకా 3000 మంది భారతీయులు చిక్కుకున్నారని, వాళ్లను సైబర్‌ బానిసల్లా మార్చారని ప్రకాశ్‌ తెలిపాడు. భారతీయ యువతులను బంధించి న్యూడ్‌ కాల్స్‌ చేయిస్తున్నారని ఆరోపించాడు. సైబర్‌ బానిసలతో డబ్బును సంపాదిస్తున్న చైనా స్కామర్లు తొలుత ఆ సొమ్మును క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. తరవాత అమెరికా డాలర్లుగా కన్వర్ట్‌ చేస్తున్నారు. డాలర్లను చైనీస్‌ యువాన్‌ కరెన్సీగా మార్చి స్వదేశానికి తరలిస్తున్నారు.

ప్రకాశ్ ఎలా చిక్కుకున్నాడంటే..

ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలను సివిల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన మున్షీ ప్రకాష్ కళ్లకు కట్టినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ప్రకాష్ విదేశాల్లో ఉపాధి కోసం అనేక జాబ్ సైట్‌లలో తన ప్రొఫైల్‌ను పోస్ట్ చేశాడు. అతనికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కంబోడియాలో ఒక ఏజెంట్ విజయ్ నుండి కాల్ వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లే ముందు తన ట్రావెల్ హిస్టరీని అందించాలని ఆ వ్యక్తి కోరాడని, మలేషియా వెళ్లేందుకు టిక్కెట్లు ఇప్పించాడని ప్రకాష్ చెప్పాడు. మార్చి 12న, మహబూబాబాద్‌లోని బయ్యారం మండలానికి చెందిన ప్రకాష్‌ను నమ్‌పెన్‌కు తీసుకెళ్లారు, అక్కడ విజయ్ స్థానిక ప్రతినిధి అతని నుండి రూ.85,000 విలువైన అమెరికన్ డాలర్లను తీసుకున్నాడు.

“తర్వాత చైనా జాతీయులు నా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.. నన్ను క్రోంగ్ బావెట్‌కు తీసుకెళ్లారు. అది టవర్‌లతో కూడిన పెద్ద కాంపౌండ్. నన్ను ఇతర భారతీయులతో కలిసి టవర్ సిలో ఉంచారు. అమ్మాయిల నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను సృష్టించడానికి, ఉపయోగించడానికి తెలుగు, ఇతర భాషల్లో మాకు పది రోజుల శిక్షణ ఇచ్చారు. , ”అని ప్రకాశ్ చెప్పాడు.. తీసుకెళ్లితన తర్వాత చీకటి గదిలో ఉంచి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని.. అనారోగ్యానికి గురైనప్పుడు వారు తనను బయటకు తీసుకెళ్లినప్పటికీ, స్కాం చేయమని బలవంతం చేశారని వివరించాడు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..