ముంబయి(Mumbai) లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ సమీపంలోని సముద్ర జలాల్లో భారీ తిమింగలం కళేబరం (Whale dead body) కొట్టుకొచ్చింది. 30 అడుగుల పొడవున్న ఈ కళేబరం బ్రైడ్ వేల్ జాతికి చెందిన తిమింగలంగా గుర్తించారు. డీఎన్‌ఏ(DNA) విశ్లేషణ కోసం కణజాల నమూనాలను సేకరించారు. ఈ జీవి ఆగస్టులో చనిపోయి ఉండవచ్చని, సముద్రంలో వచ్చే ఆటుపోట్లకు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. తిమింగలం మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దాని కళేబరాన్ని పరిశీలించారు. మరణానికి గల కారణాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. తిమింగలం కళేబరాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో, 30 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 40 అడుగుల పొడవైన తిమింగలం కళేబరం మహారాష్ట్రలోని వసాయ్‌లోని మార్డెస్ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. గాయాల బారిన పడి మరణించిన జలచరాలే ఎక్కువగా తీరానికి కొట్టుకొస్తుంటాయని.. నౌకలు, ఓడల కింద ఉండే పదునైన భాగం తగలడంతో తిమింగలాలు ప్రాణాలు కోల్పోతుంటాయని అధికారులు భావిస్తున్నారు.
An washed away whale was taken ashore by RFO Warak and team near Breach Candy hospital in Mumbai….courtesy crane provided by L&T #conservation #marine #earthwatch pic.twitter.com/YbciUe3NPn
— Clement Ben IFS (@ben_ifs) March 23, 2022
Also Read
పట్టు పరికిణీలో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ.. అమృత అయ్యర్..
Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్ ట్రీట్.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..