Viral Video: హైవే రోడ్డుపై యువకుల హల్‌చల్‌.. భయంకర స్టంట్లు చేస్తూ వీరంగం.. కారుపై పోలీస్‌ స్టిక్కర్‌..!

|

Jan 09, 2023 | 5:54 PM

ఇలాంటి భయంకర విన్యాసాల కారణంగా వారికి మాత్రమే కాదు, తోటి ప్రయాణికులు, వాహనదారులకు కూడా ప్రమాదం పొంచివుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ రీట్విట్‌ చేస్తున్నారు.

Viral Video: హైవే రోడ్డుపై యువకుల హల్‌చల్‌.. భయంకర స్టంట్లు చేస్తూ వీరంగం.. కారుపై పోలీస్‌ స్టిక్కర్‌..!
Stunt
Follow us on

ఢిల్లీ-మీరట్ హైవే రోడ్లపై కొందరు యువకులు భయంకర స్టంట్స్‌తో రెచ్చిపోయారు. కదులుతున్న కారుపై ఎక్కి విన్యాసాలు చేశారు. ముగ్గురు వ్యక్తులు కదులుతున్న కారులోంచి ప్రమాదకర రీతిలో బయటికి వంగి కనిపించారు. వారిలో ఒకరు తన ఫోన్ కెమెరాలో కారు స్పీడును వీడియో తీస్తూ కనిపించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు భద్రతతో పాటు తమ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేలా తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో వీడియో మీరట్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోకు సమాధానంగా ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని పోలీసు యంత్రాంగం తెలిపింది.

అయితే, ట్వీట్ ప్రకారం.. యువకులు ప్రయాణిస్తున్న కారుపై పోలీస్ స్టిక్కర్ ఉన్నట్టుగా తెలిసింది. స్వాతి మలివాల్ చేసిన ట్వీట్‌ ఆధారంగా పోలీసు సైరన్, రెడ్ లైట్‌, పోలీసు స్టిక్కర్ వేసి ఉన్న వాహనంలో వేలాడుతూ హైవేపై ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ప్రయాణించి వారు ఎవరో తెలుసుకోవాలని సూచించారు. కారుపై పోలీస్ అని రాసి ఉంది. ఇది పోలీసు అధికారుల వాహనం అయితే, ఎవరి ప్రమేయంతో వాళ్లు ఇలాంటి స్టంట్ చేస్తున్నారో కనిపెట్టాలని డిమాండ్‌ చేశారు. వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని కూడా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో జాకెట్లు ధరించిన యువకులు.. కారు కిటికీలోంచి బయటకు వంగి వేలాడుతూ కనిపించారు. మారుతీ సుజుకి కారు UP రాష్ట్రం క్రింద రిజిస్టర్ చేయబడింది. నంబర్ ప్లేట్ “UP 14 AE 3621” అని రాసి ఉంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భయంకర విన్యాసాల కారణంగా వారికి మాత్రమే కాదు, తోటి ప్రయాణికులు, వాహనదారులకు కూడా ప్రమాదం పొంచివుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ రీట్విట్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.