జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఉగ్రవాదులకు లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశాయి. అయినా ముష్కర మూకలు వినకుండా భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.
మృతిచెందిన వారిలో ఇద్దరు ఉగ్రవాదులు లతీఫ్ లోన్ ఏరియాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరూ కశ్మీర్ పండిట్ పురాన కృష్ణ భట్‌ను హత్యచేసినట్లు వెల్లడించారు. మరో ఉగ్రవాది ఉమర్ నజీర్ అనంతనాగ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు కశ్మీర్ అదనపు డీజీపీ వెల్లడించారు. ఉమర్ నజీర్‌కు నేపాల్‌కు చెందిన టిల్ బహదూర్ తాపా హత్యలో ప్రయేయం ఉందని పేర్కొన్నారు.
Shopian, J&K | Encounter underway between security forces and terrorists, 3 LeT terrorists killed at Munjh Marg area
(Visuals deferred by unspecified time) pic.twitter.com/ky2KqbDNbm
— ANI (@ANI) December 20, 2022
వీరంతా లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఒక ఏకే 47 రైఫిల్, 2 పిస్తోల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..