ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఓ వైపు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్ని ఏరివేస్తూనే.. మరోవైపు దొరికిన ఉగ్రవాదుల్ని దొరికినట్లు అరెస్ట్ కూడా చేస్తున్నారు.

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

Edited By:

Updated on: Jun 21, 2020 | 11:54 AM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఓ వైపు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్ని ఏరివేస్తూనే.. మరోవైపు దొరికిన ఉగ్రవాదుల్ని దొరికినట్లు అరెస్ట్ కూడా చేస్తున్నారు. గత నెల రోజుల్లో దాదాపు పది మందికి పైగా ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. తాజాగా శనివారం నాడు.. ముగ్గురు లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదుల్ని సోపోర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు అరెస్ట్ చేశాయి. టార్జూ, బోమీ ప్రాంతాల్లో కూంబింగ్ జరుపుతున్న సమయంలో.. ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఉగ్రవాదుల్ని షబీర్ అహ్మద్, మహ్మద్ అబ్బాస్ మీర్, ఫహీమ్ నబీ భట్‌గా గుర్తించారు. వీరిపై సంబంధించి సెక్షన్ల కింద బోమీ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.