
బీహార్ రాజధాని పాట్నాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాట్నాకు పశ్చిమాన 100 కి.మీ దూరంలోని సరన్ జిల్లాలోని సరయు నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది గల్లంతయ్యారు . నీటి ఉధృతికి పడవ బోల్తా పడింది. ఇది చూసిన వెంటనే స్థానికులు స్పందించి.. నదిలో కొట్టుకుని పోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ముగ్గురిని రక్షించారు. మిగిలిన వారు కొట్టుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది రంగంలోకి దిగి.. కొట్టుకుని పోయినవారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు.
మాంఝీ ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్న సరన్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్, డైవర్లు ఈ మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు కొద్ది దూరంలో ఉన్న మతియార్ ఘాట్ సమీపంలో పడవలో 24 నుంచి 25 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పడవ బోల్తా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పడవ బోల్తా పడడానికి కారణంగా చాలామంది ఒక్కసారిగా పడవలో ఒక వైపుకి చేరుకున్నట్లుగా.. అప్పడు పడవ ఒకవైపుకు ఒరిగిపోవడం గుర్తించిన వెంటనే అందులో ఉన్నవారు భయంతో ఒకవైపుకు చేరుకున్నారు. ఇలా అందరూ అకస్మాత్తుగా పడవలో ఓ వైపుకు వెళ్లడంతో పడవ బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అమన్ సమీర్ తెలిపారు. అయితే జనం ఇలా ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారో తెలియదని తెలిపారు. ఈ రోజు కూడా గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..