
కేంద్ర ప్రభుత్వ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మండి పడ్డారు. పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదం పొందుతున్న తీరును తప్పుబట్టారు. మంగళవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన వైఖరిని డెరిక్ తీవ్రంగా ఆక్షేపించారు. పార్లమెంట్‌లో బిల్లులను సమీక్షించాలని, కాని ఈసారి సభలో హడావుడిగా పాసవుతున్నాయంటూ ట్వీట్ చేశారు. మనమేమైనా పిజ్జాలు డెలివరీ చేస్తున్నామా.. లేక బిల్లులను పాస్ చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాలనలో పాసైన బిల్లుల వివరాలు, ఇప్పుడు బీజేపీ పాలనలో పాసైన బిల్లుల వివరాలకు సంబంధించిన చార్ట్‌ను తన ట్వీట్‌లో పోస్టు చేశారు.
#Parliament is supposed to scrutinize Bills. This chart explains the bulldozing this Session. Are we delivering pizzas or passing legislation? #ConstructiveOpposition pic.twitter.com/DKPDygpoV5
— Derek O’Brien | ডেরেক ও’ব্রায়েন (@derekobrienmp) July 31, 2019