Viral: కుక్కకు రూ.7లక్షల ఖర్చుతో గ్రాండ్‌గా బర్త్‌డే పార్టీ.. ముగ్గురు అరెస్ట్‌.. ఎందుకో తెలుసా?

పెట్స్ డాగ్స్ అంటే చాలామందికి ప్రేమ సహజమే. అందుకే వాటిని కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అక్కడక్కడ వీటికి పుట్టిరోజులు కూడా చేస్తుంటారు.

Viral: కుక్కకు రూ.7లక్షల ఖర్చుతో గ్రాండ్‌గా బర్త్‌డే పార్టీ.. ముగ్గురు అరెస్ట్‌.. ఎందుకో తెలుసా?
Dog Birthday Party

Updated on: Jan 10, 2022 | 11:16 AM

పెట్స్ డాగ్స్ అంటే చాలామందికి ప్రేమ సహజమే. అందుకే వాటిని కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అక్కడక్కడ వీటికి పుట్టిరోజులు కూడా చేస్తుంటారు. ఈ కోవలోనే  గత కొద్ది రోజుల క్రితం.. ఓ వ్యక్తి తన పెంపుకు కుక్కకు 7 లక్షల ఖర్చుతో అత్యంత ఘనంగా బర్త్ డే వేడుకలు చేయడం తెలిసిందే. అహ్మదాబాద్ లోని కిరణ్ పార్క్ సొసైటీలో ఉండే సోదరులు చిరాగ్ పటేల్, ఊర్విష్​ పటేల్​ పెంపుడు శునకం ‘అబ్బీ’ బర్త్​డే వేడుకల కోసం రంగురంగుల విద్యుద్దీపాలు, డీజే, ఫ్లెక్సీలు.. ఇలా అన్ని హంగులతో సంబరాలు చేశాడు. కుక్క పుట్టినరోజును అంగరంగ వైభవంగా చేశారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు.  ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ, పోలీసుల కంట పడింది.

అయితే కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఈ వేడుక జరగడం వల్ల సోదరులతోపాటు, వారి స్నేహితుడు దివ్యేష్​ మెహారియాను అరెస్ట్ చేశారు పోలీసులు. వేడుకలో ఎవ్వరూ.. మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించారని తెలిపారు. కాగా, కుక్క పుట్టినరోజు వేడుకల వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

పోలీసుల అదుపులో నిందితులు

Also Read: నల్గొండ జిల్లాలో షాకింగ్ సీన్.. గుడి ముందు పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి తల