25 ఏళ్ల పాలనా ప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ సేవకు మరింత అంకితభావంతో పనిచేస్తానని సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో శ్రీ వినాయక మందిరాన్ని సందర్శించిన మోదీ.. సిద్ధి, బుద్ధి సమేత గణేశుడితో పాటు హరిహరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో సేవా సంకల్ప్‌ జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్’పై ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు..

25 ఏళ్ల పాలనా ప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ ప్రత్యేక పూజలు
PM Modi 25 Years in Government

Updated on: Oct 07, 2026 | 8:49 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశ ప్రధాన పాలసీమేకర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ సేవకు మరింత అంకితభావంతో పనిచేస్తానని ఆయన తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న శ్రీ వినాయక మందిరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆలయంలో సిద్ధి, బుద్ధి సమేత గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం హరిహరులకు కూడా ప్రత్యేక పూజలు చేసి దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. మరోవైపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సేవా సంకల్ప్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ‘సేవా సంకల్ప్‌ జ్యోతి’ ప్రజ్వలన జరగనుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సేవా సంకల్ప యాత్రికులు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి


ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల మైలురాయిని చేరుకున్న మోదీ, ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్’పై ప్రసంగించనున్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్‌ లక్ష్యాలపై ఆయన తన ఆలోచనలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రజాసేవే తన రాజకీయ ప్రస్థానానికి కేంద్రబిందువని చెబుతూ వస్తున్న ప్రధాని.. పాతికేళ్ల పాలనా అనుభవం తర్వాత కూడా అదే అంకితభావంతో దేశానికి సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరోసారి చాటుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us