Balakot Air Strike: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కి రెండేళ్లు.. వెలుగులోకి సరికొత్త విషయాలు.. ఈ ‘కోడ్’ పాక్‌ను మాయ చేసిన ఇండియన్ ఆర్మీ..

|

Feb 26, 2021 | 2:26 PM

Balakot Air Strike: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌పై దాడి చేసి నేటికి రెండేళ్లు అవుతోంది.

Balakot Air Strike: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కి రెండేళ్లు.. వెలుగులోకి సరికొత్త విషయాలు.. ఈ ‘కోడ్’ పాక్‌ను మాయ చేసిన ఇండియన్ ఆర్మీ..
Follow us on

Balakot Air Strike: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌పై దాడి చేసి నేటికి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా బాలాకోట్ దాడికి సంబంధించి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దాడికి ప్రతీకరంగా సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2019, ఫిబ్రవరి 26వ తేదీన తెల్లవారుజామున 3.30 గంటకు భారత మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఎల్ఓసీని దాటుకుని పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ టెర్రర్ క్యాంప్‌పై విరుచుకుపడ్డాయి. ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. అయితే, ఈ వ్యూహాత్మక దాడి వెనుక పెద్ద తతంగమే నడించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ప్రత్యర్థులను మభ్యపెడుతూ కోడ్ లాంగ్వేజ్‌తో అనుకున్న పనని సక్సెస్‌ఫుల్‌గా కానిచ్చేశారు. ఇంతకీ ఆ కోడ్ ఏంటి..? అసలేం జరిగింది.? తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3.45 నిమిషాల సమయంలో అప్పటి ఎయిర్ చీఫ్ బిఎస్ ధనోవా ప్రత్యేక భద్రతా రాక్స్ నంబర్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు కాల్ చేశఆరు. రాక్స్(RAX) అనేది అల్ట్రా సేఫ్ ఫిక్స్‌డ్ లైన్ నెట్‌వర్క్. ఆ సందర్భంగా జరిగిన సంభాషణలో ‘కోతి చంపబడింది’ అని హిందీలో చెప్పాడు. అయితే ఈ పదానికి పెద్ద అర్థమే ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌లోని బాలకోట్‌లో గల జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాద శిబిరాన్ని భారత ఫైటర్ జెట్ ధ్వంసం చేసిందనేది ధనోవా వ్యాఖ్యల సారాంశం. ఇదే సందేశాన్ని అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారన్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ కార్యదర్శి అనిల్ ధస్మానాకు కూడా ధనోవా చేరవేశాడు. చివరగా వైమానిక దాడి సక్సెస్ అని ఎన్‌ఎస్‌ఏ దోవల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు.

‘బందర్’ కోడ్‌లో దృష్టి మరల్చి..

2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ ఈ వైమానిక దాడి చేసింది. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు. ఇప్పుడు రెండేళ్ల తరువాత ఆపరేషన్ గురించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. బాలకోట్ వైమానిక దాడులకు సంబంధించి, పాకిస్తాన్ అధికారుల దృష్టి మల్లించడం కోసం ఆపరేషన్ కోడ్‌ను ఉద్దేశపూర్వకంగా బందర్ అని పేరు పెట్టారని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ కోడ్ భవాల్పూర్ లోని ఉగ్రవాద సంస్థ యొక్క జెఎమ్ ప్రధాన కార్యాలయాన్ని సూచిస్తుంది. అటాక్‌కు ముందు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌ దృష్టిని మల్లించడానికి రాజస్థాన్‌ గగనతలంలో కొన్ని యుద్ధ విమానాలను ఎగురవేశారు. దాంతో పాక్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ శ్రద్ధ అంతా రాజస్థాన్‌ సరిహద్దుల్లో పడింది. దీంతో ఇండియన్ ఆర్మీ వ్యూహాత్మకంగా బాలాకోట్‌పై దాడి చేసి పాకిస్థాన్‌ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

పాకిస్తాన్ రాడార్‌కు షాక్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ..
అధికారిక వివరాల ప్రకారం.. భారత సైన్యానికి చెందిన అప్‌గ్రేడెడ్ మిరాజ్ 2000 ఎల్ఏసీని దాటి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దాదాపు 90 కిలోల స్పైస్ పెనెట్రేటర్ బాంబులను భారీ సంఖ్యలో తీసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. భారత వైమానిక దళం ఉద్దేశపూర్వకంగానే ఫిబ్రవరి 26 ను వైమానిక దాడుల రోజుగా ఎంచుకుంది. ఎందుకంటే ఇది పౌర్ణమి రాత్రి కావటం.. ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించడాని వీలుగా ఉంటుందని భావించి సడెన్ ఎటాక్ చేశారు. ఇక ఇండియన్ జైట్ ఫైటర్లు ముందుగా పిర్ పంజాల్ శ్రేణి ప్రాంతాల్లో దిగువన ఎగురుతూ పాకిస్తాన్ రాడార్‌ను చాకచక్యంగా మోసం చేశాయి. ఇలా మొత్తంగా ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3.30 గంటలకు పాకిస్థాన్‌లోని ఐదు చోట్ల మొత్తం ఐదు బాంబులను వేశారు. అయితే, ఆరో బాంబు కూడా వేసినప్పటికీ.. సాంకేతిక సమస్యల కారణంగా అది పేలలేదు. అది పేలకపోవడం వల్లే బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాల్లో ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది.

వైమానిక దాడి తరువాత ప్రధాని మోదీ సమావేశం..
వైమానిక దాడి తరువాత ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమైన మంత్రులు, పీఎంఓ ఉన్నతాధికారులు, కేబినెట్ కార్యదర్శి, హోం కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, కార్యదర్శి (రా), డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు అప్పటి వైమానిక దళం చీఫ్‌లతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పీఎం ఇంటెలిజెన్స్ రా కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. ఐఎఎఫ్ చీఫ్‌ను కూడా అభినందించారు. ఈ సమావేశంలో డోవల్, ధనోవా, ధస్మనాలతో చేతులు కలిపి ప్రత్యేకంగా అభినందించారు.

Also read:

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్ వ్యాక్సిన్.. తెలంగాణలో ఒక వ్యాక్సిన్ ధర ఎంతంటే..?

హైదరాబాద్‌లో అదిరిపోయే లుక్ లో కెమెరా కంట పడ్డ తల’ అజిత్ కుమార్’