Omicron Variant: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మరో రెండు కేసులు నమోదు.. ఎక్కడంటే..?

|

Dec 06, 2021 | 8:13 PM

India Omicron Cases: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కేసులతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. తాజాగా

Omicron Variant: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మరో రెండు కేసులు నమోదు.. ఎక్కడంటే..?
Omicron Covid Variant
Follow us on

India Omicron Cases: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కేసులతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎనిమిది కేసులు ఉండగా.. తాజాగా ముంబై నగరంలో నమోదైన రెండు కేసులతో వీటి సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి ముంబయికి వచ్చిన మరో వ్యక్తి (36) కి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసుల సంఖ్య 23కి పెరిగింది.

కాగా.. ఆదివారం ఒక్కరోజే దేశంలో కేసులు భారీగా వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్లో 9 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో ఏడు, ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. రాజస్థాన్‌ జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ కావడం కలకలం రేపింది. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు అందరూ ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారే ఉండటం గమనార్హం. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 10 కేసులు నమోదు కాగా.. రాజస్థాన్‌లో 9, కర్ణాటకలో 2, ఢిల్లీలో 1, గుజరాత్‌లో 1 చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read:

Crime News: పిల్లనిచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించిందని మహిళపై దాడి.. దారుణంగా గొంతు కోసి..

Vote Fine: ఓటు వేయకపోతే ఇకపై భారీ జరిమానా.. సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌.. ఇది నిజమేనా..?