Fire Accident: అగ్ని ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే మరో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు భవనంపైకి దూకి..

|

Mar 02, 2021 | 12:46 AM

Fire Accident: అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం.. ఇంకా అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా..

Fire Accident: అగ్ని ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే మరో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు భవనంపైకి దూకి..
Follow us on

Fire Accident: అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం.. ఇంకా అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో ఓ టెక్స్‌టైల్స్‌ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగి 24 గంటలు కూడా గడవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఐదంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ఒక భవనం నుంచి మరో భవనంపైకి దూకినట్లు అధికారులు తెలిపారు. అయితే ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో విద్యుత్‌ మీటర్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పొగలు పైఅంతస్తులకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకునే లోపే ఓ మహిళ, మరో పురుషుడు భయంతో తమ ఇంటి కటికీలోంచి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పైకి దూకినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయలు కాలేదన్నారు. ఇరుకైన ప్రాంతంలో ఈ భవనం ఉండటంతో మంటలను ఆర్పేందుకు ఇబ్బందులు పడినట్లు చెప్పారు. అలాగే ఈ భవనం కింద ఉండటంతో కింది ఫ్లోర్‌లో చెలరేగిన పొగలు పై అంతస్తులకు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారి నీలీస్‌ దవే తెలిపారు. వారిని దాదాపు 9 మంది అగ్నిమాపక సిబ్బంది ట ఎర్రాస్‌ పైఔకి చేర్చి ఆ తర్వాత కిందికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఘటన స్థలానికి ఆరు అగ్నిమాపక శకటాలతో చేరుకుని మంటలను ఆర్పివేశారు. భారీగా చెలరేగిన మంటలను పది నిమిషాల్లోనే అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

కాగా, ఆదివారం అర్ధరాత్రి పెండేసరి పారిశ్రామిక ప్రాంతంలోని టెక్స్‌టైల్ మిల్లులోని మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి 15 అగ్ని మాపక శకటాలతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు. అయితే ఇలా అగ్ని ప్రమాదాలు చాలానే జరుగుతున్నాయి. కారణాలు ఏవైనా.. ఇలాంటి అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. షార్ట్‌స్క్యూట్‌ కారణంగానో, ప్రమాదవశాత్తు తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరిగి కోట్లల్లో ఆస్తి బుగ్గిపాలవుతోంది. దీంతో కొన్ని సంఘటనల్లో పలువురి ప్రాణాలు బుగ్గిపాలైపోతున్నాయి. ఇక ఎండాకాలం ఉండటంతో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇవి చదవండి:

Spectrum Auction: మొదటి రోజే రూ. 77 వేల కోట్ల ఆదాయం.. ఐదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న టెలికం స్పెక్ట్రమ్‌ వేలం

సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికిన కత్తులు.. న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణలో కీలక పురోగతి