GST On Rent: జీఎస్‌టీతో ఇంటి అద్దెలు భారీగా పెరగనున్నాయా.? వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజం ఏంతంటే..

|

Aug 12, 2022 | 6:05 PM

GST On Rent: జూన్‌ నెలలో జరిగిన 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక మార్పులకు కేంద్రం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో...

GST On Rent: జీఎస్‌టీతో ఇంటి అద్దెలు భారీగా పెరగనున్నాయా.? వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజం ఏంతంటే..
Follow us on

GST On Rent: జూన్‌ నెలలో జరిగిన 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక మార్పులకు కేంద్రం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆమోదించిన వాటిలో అద్దెకుంటున్న వారు అద్దెపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలన్న అంశం ఒకటి. అయితే దీనిపై సోషల్‌ మీడియా వేదికగా కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం పలు వార్తా కథనాలను ప్రచురించాయి. వీటి ప్రకారం ఇంటి అద్దెలు ఇప్పుడున్న వాటి కంటే 18 శాతం పెరగనున్నాయని కథనాలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వం స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది.

ఇంటి అద్దెలు పెరగనున్నాయన్న దానిపై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విట్టర్‌ పేజీ ద్వారా అవగాహన కల్పించింది. అసలు జీఎస్‌టీ ఎవరు వర్తిస్తుంది.? అన్న విషయాలను వివరిస్తూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వ్యాపార అవసరాల కోసం అద్దెకు తీసుకున్న వారికి మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత అవసరాల కోసం అద్దెకుండే వారెవరూ జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం.. కేవలం వ్యాపార అవసరాల కోసం అద్దె తీసుకున్న వారు అందులోనూ జీఎస్‌టీలో రిజిస్టర్‌ అయిన వాళ్లు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పౌరులు ఉండే ఇంటి అద్దెలపై ఎలాంటి ప్రభావం పడదు.

ఇది కూడా చదవండి..