Viral: స్టెప్‌నీ టైర్ విప్పగానే పోలీసుల కళ్లు బైర్లు గమ్మాయి.. వామ్మో.. మరీ ఇంత గూడుపుఠాణినా..?

|

Jun 27, 2022 | 8:35 PM

గంజాయి స్మగ్లింగ్ చేసే మెయిన్ వ్యక్తులు దొరకడం లేదు. మధ్యలో డబ్బులకు ఆశపడి రవాణా చేసే వ్యక్తులను అసలైన స్మగ్లర్స్ పావులుగా వాడుకుంటున్నారు.

Viral: స్టెప్‌నీ టైర్ విప్పగానే పోలీసుల కళ్లు బైర్లు గమ్మాయి.. వామ్మో.. మరీ ఇంత గూడుపుఠాణినా..?
Ganja
Follow us on

అవగాహన కల్పించినా..గంజాయి జోలికి వెళ్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించినా దందాకు మాత్రం కళ్లెం పడటం లేదు. స్పెషల్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నా… డ్రగ్స్‌(Drugs), గంజాయి(Cannabis) స్మగ్లర్లు బరితెగిస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. పోలీసులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు. పుష్ప(Pushpa) సినిమాలో రెడ్ శాండిల్(Red sandalwood) అక్రమంగా తరలించేందుకు హీరో అల్లు అర్జున్ అనుసరించిన ట్రిక్స్‌ను మించిన ట్రిక్స్ గంజాయి స్మగ్లర్స్ ఫాలో అవుతున్నారు. అందుగలదు.. ఇందు లేదు అని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. పోలీసులకు గంజాయి కనిపిస్తూనే ఉంది.  దేశవ్యాప్తంగా నిత్యం డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్న కేసులు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓడిశాలోని కటక్ జాతీయ రహదారి (NH)-16పై బండలో టోల్ ప్లాజా సమీపంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. మత్తును తరలించేందుకు ఓ రేంజ్‌లో స్కెచ్‌ వేశారు స్మగ్లర్స్. పోలీసులు విపరీతంగా తనిఖీలు చేస్తుండటంతో..  స్టెప్‌నీ టైర్లలో గుట్టుగా గంజాయి కుక్కేశారు. అయినా సరే వారి ఎత్తులు పారలేదు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. రెండు వాహనాల నుండి 172 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందులో ఒక వాహనం సికింద్రాబాద్‌ నుంచి బీహార్‌కు వెళ్తుండగా, మరో వాహనం ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా నుంచి బీహార్‌కు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

Video Credits: ommcom news

కాగా గంజాయి స్మగ్లింగ్ చేసే మెయిన్ వ్యక్తులు దొరకడం లేదు. మధ్యలో డబ్బులకు ఆశపడి రవాణా చేసే వ్యక్తులను అసలైన స్మగ్లర్స్ పావులుగా వాడుకుంటున్నారు. కొందరు పేద కుర్రాళ్లు డబ్బు కోసం ఈ పని చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.