చెక్ పోస్ట్ దగ్గర ఆగిన వ్యాన్.. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా.. కళ్లు చెదిరిపోయే సీన్

|

Apr 01, 2023 | 2:13 PM

ఓ చిన్న వ్యాన్.. ప్రధాన రహదారి గుండా ప్రయాణిస్తోంది. ఈ సమయంలో పోలీసులు.. చెక్ పోస్టు దగ్గర వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అయితే.. ఈ వ్యాన్ వచ్చి రాగానే చెక్ పోస్టు దగ్గర నిలిచిపోయింది. పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు..

చెక్ పోస్ట్ దగ్గర ఆగిన వ్యాన్.. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా.. కళ్లు చెదిరిపోయే సీన్
Van
Follow us on

కర్ణాటకలో ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం కాన్వాయ్ సహా.. సామాన్యుల వాహనాల వరకు అన్నింటిని ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద స్థానిక పోలీసులను మోహరించి.. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పకడ్భంధీ చర్యలను చేపట్టింది. ఈ సమయంలోనే భారీ స్మగ్గింగ్ బయటపడింది. ఆ స్మగ్లింగ్ వ్యవహారం ఏంటీ..? అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకోండి.. ఓ చిన్న వ్యాన్.. ప్రధాన రహదారి గుండా ప్రయాణిస్తోంది. ఈ సమయంలో పోలీసులు.. చెక్ పోస్టు దగ్గర వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అయితే.. ఈ వ్యాన్ వచ్చి రాగానే చెక్ పోస్టు దగ్గర నిలిచిపోయింది. పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు.. ఈ క్రమంలో డ్రైవర్ కు చెమటలు పట్టడం చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వ్యాన్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ క్రమంలో వారికి దొరికింది చూసి ఒక్కసారిగా కళ్లు తేలేశారు. ఆ వ్యాన్ నుంచి కేజీల కొద్ది బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిక్కమగళూరులోని ట్రైకెరెలోని ఎంసీ హళ్లి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం లాజిస్టిక్ వాహనంలో.. రూ.6.44 కోట్ల విలువైన 17 కిలోల బంగారం లభ్యమైనట్లు కర్ణాటక పోలీసు యంత్రాంగం తెలిపింది.

Van

సీక్వెల్ లాజిస్టిక్స్‌కు చెందిన వాహనంలో ఈ బంగారం దొరికింది. ఎలాంటి సరైన పత్రాలు లేకుండా బంగారాన్ని వాహనంలో తరలిస్తున్నారని.. తనిఖీల్లో పట్టుబడిందని అధికారులు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. వాహనాన్ని తరికెరె స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..