వావ్ గ్రేట్.. 8 గంటల పాటు ఆగకుండా ఈతకొట్టి రికార్డు సృష్టించింది..ఎవరంటే

|

Apr 10, 2023 | 6:34 AM

సరదాగా ఈత కోసమని వెళ్లి కాలువలు, చెరువులకు వెళ్లి చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే కొందరు గంట, రెండు గంటల వరకు కూడా ఆగకుండా ఈత కొట్టగలరు.

వావ్ గ్రేట్.. 8 గంటల పాటు ఆగకుండా ఈతకొట్టి రికార్డు సృష్టించింది..ఎవరంటే
Chandrakala
Follow us on

సరదాగా ఈత కోసమని వెళ్లి కాలువలు, చెరువులకు వెళ్లి చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే కొందరు గంట, రెండు గంటల వరకు కూడా ఆగకుండా ఈత కొట్టగలరు. కానీ చత్తీస్ గఢ్ కు చెందిన ఓ 15 ఏళ్ల అమ్మాయి మాత్రం రికార్డు సృష్టించింది. దాదాపు 8 గంటల పాటు నిర్విరామంగా ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. దర్గ్ జిల్లాలోని పూరాయి గ్రామానికి చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా ఈ ఘనత దక్కించుకుంది. ఆమె ఆదివారం రోజున తెల్లవారుజామున అయిదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆగకుండా నిర్విరామంగా ఈత కొట్టింది.

అయితే ఈ కార్యక్రమానికి చత్తీస్ గఢ్ హోం శాఖ మంత్రి తామ్రధ్వాజ్ సాహూ కూడా హాజరయ్యారు. చెరువులో చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు ఈత కొట్టింది. ఈ రికార్డు సృష్టించిన ఆమె చెరువు నుంచి బయటకు రాగానే స్థానికులు అభినందనలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..