India – Pakistan: మారని పాకిస్తాన్‌ వక్ర బుద్ధి.. 15మంది భారత్‌ పౌరులు మృతి..

పాకిస్తాన్‌ వక్రబుద్ధి ఏమాత్రం మారడంలేదు. బోర్డర్‌లో బరి తెగించి వ్యవహరిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించి చాలామంది భారత పౌరులను బలితీసుకుంది. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి చెందగా.. 50 మందివరకు గాయపడినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. 

India - Pakistan: మారని పాకిస్తాన్‌ వక్ర బుద్ధి.. 15మంది భారత్‌ పౌరులు మృతి..
Pakistan's Ceasefire Violation

Updated on: May 08, 2025 | 8:32 AM

పాకిస్తాన్‌ వక్రబుద్ధి ఏమాత్రం మారడంలేదు. బోర్డర్‌లో బరి తెగించి వ్యవహరిస్తూనే ఉంది. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు కమ్ముకొస్తున్నా.. తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నా.. ఉగ్ర శిబిరాలే టార్గెట్‌గా ఇండియన్‌ ఆర్మీ విరుచుకుపడుతున్నా.. దాయాది దేశంలో మార్పు కనిపించడంలేదు. గత కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గామ్‌ ఉగ్రదాడికి బదులుగా పాక్‌ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అదేసమయంలో.. పాక్‌ రేంజర్లు బోర్డర్‌లో రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. సరిహద్దుల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ భారత పౌరుల ప్రాణాలు తీస్తున్నారు.

ఇండియన్‌ ఆర్మీ స్ట్రాంగ్‌ ఎటాక్‌తో.. ఏం చేయాలో అర్థం కాని పాక్‌ సైన్యం అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది. మరోసారి సరిహద్దుల్లో కాల్పులు జరపడంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా.. 50 మందివరకు గాయపడినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. ఇక.. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతులతోపాటు గాయపడ్డవారంతా పూంచ్‌ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

గాయపడ్డవారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పూంచ్‌, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొంది. సాధారణ నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడుతోందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే.. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు.

మొత్తంగా.. ఆపరేషన్‌ సిందూర్‌తో పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇవ్వగా.. ఎల్‌వోసీ వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పాక్‌ తన కుట్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండవ రోజు జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలోని కర్నా ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో మరో సారి కాల్పులకు బరితెగించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.. నిరంతరం.. కాల్పులు జరుపుతుండటంతో.. ఆర్మీ వెంటనే స్పందించి.. వారికి తగిన గుణపాఠం చెబుతోంది.. అయితే.. పాక్ సైన్యం కాల్పుల్లో పలువురు ఆర్మీ సిబ్బంది కూడా మరణించారు..

వాస్తవాధీన రేఖ వెంట కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కాల్పులకు దిగింది. కాల్పులతో పాటు ఆర్టిలరీ గన్స్‌ను కూడా పాక్ సైన్యం ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. పాక్ కవ్వింపు చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..