అయ్యో.. 19వ అంతస్తు నుంచి దూకిన బాలిక.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

మహారాష్ట్ర రాష్ట్రంలోని కల్యాణ్ పట్టణంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక 19వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కల్యాణ్ పశ్చిమ ప్రాంతంలోని ప్రముఖ హై-ప్రొఫైల్ రౌనక్ సిటీ సొసైటీలో చోటుచేసుకుంది. బాలిక భవనం పైఅంతస్తు నుండి దూకుతున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయ్యో.. 19వ అంతస్తు నుంచి దూకిన బాలిక.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Kalyan Student Suicide

Edited By: Anand T

Updated on: Nov 14, 2025 | 1:04 PM

మహారాష్ట్ర రాష్ట్రంలోని కల్యాణ్ పట్టణంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక 19వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి పేరు రిద్ధి ఖరాడే (14). ఆమె స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్ల రిద్ధి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటూ, చదువు విషయంలో ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు.

పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్ల తల్లిదండ్రులను నిరాశపరిచానన్న భావనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దుర్ఘటన రోజున రిద్ధి తన పెద్ద అక్కతో కలిసి ఇంట్లో ఉండగా, ఒక్కసారిగా 19వ అంతస్తు టెర్రస్ వైపు వెళ్లి దూకేసింది. ఈ ఘటన తన కళ్ల ముందే జరగడంతో ఆమె అక్క తీవ్ర షాక్‌కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు, పొరుగువారు కలసి పోలీసులకు సమాచారం అందించారు. ఖడ్కపాడా పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో రౌనక్ సిటీ సొసైటీ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో పరీక్షల ఒత్తిడే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. రిద్ధి చనిపోయిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పాఠశాల సిబ్బంది, స్నేహితులు కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలలపై విద్యా ఒత్తిడిని తగ్గించేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు మరింత శ్రద్ధ వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.