Viral Video: 3 బైకులు, 14 మంది యువకులు.. హైవేపై స్టంట్లతో హడలెత్తించారు.. ఆఖరుకు తిక్క కుదిరింది..?

|

Jan 11, 2023 | 6:34 PM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు పోలీసు కారులో విన్యాసాలు చేస్తూ కనిపించిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. హైవేపై కదులుతున్న కారులో వ్యక్తులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.

Viral Video: 3 బైకులు,  14 మంది యువకులు.. హైవేపై స్టంట్లతో హడలెత్తించారు.. ఆఖరుకు తిక్క కుదిరింది..?
Ride In Trouble
Follow us on

మూడు బైక్‌లపై 14 మంది విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు బైక్‌లను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. వైరల్ వీడియోలో, బరేలీలోని డియోరానియా పోలీస్ సర్కిల్‌లో మూడు బైక్‌లపై మొత్తం 14 మంది యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి కూర్చుని భయంకరంగా ప్రయాణించారు. యువకులు బరేలీ-నైనిటాల్ హైవేపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురిచేశారు. వీడియోలో చూసినట్లుగా బైక్‌ వెళ్తున్న వారెవరూ హెల్మెట్ ధరించలేదు. సమాచారం అందుకున్న వెంటనే బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టుగా బరేలీ ఎస్‌ఎస్పీ అఖిలేష్ కుమార్ చౌరాసియా తెలిపారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు పోలీసు కారులో విన్యాసాలు చేస్తూ కనిపించిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. హైవేపై కదులుతున్న కారులో వ్యక్తులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. ఈ వ్యక్తులు ఉపయోగించిన కారులో ఎరుపు రంగులో ఉంది. పైగా కారుపై పోలీసు స్టిక్కర్ కూడా ఉంది. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ షేర్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి విచారణ జరుపుతున్నారు.
 

 

గత ఏడాది మే నెలలో కూడా నోయిడాలో 21 ఏళ్ల వ్యక్తి బైక్ స్టంట్ చేశాడు. రెండు కదిలే SUVల మధ్య తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ, తన ద్విచక్ర వాహనంపై విన్యాసాలు చేశౄడు. తరువాత అతన్నిపోలీసులు అరెస్టు చేశారు. అతని ఇద్దరు స్నేహితులను కూడా ఇదంతా వీడియో తీసినందుకు అరెస్టు చేశారు. ఈ విన్యాసాలను సదరు వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దాంతో అప్పట్లో వార్త వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…