
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి కోల్‌కతాలోని ఒక హోటల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. జరిగిన అగ్నిప్రమాదంలో14 మంది మృతి చెందినట్టుగా తెలిసింది.. సెంట్రల్ కోల్‌కతాలోని ఫలపట్టి మచ్చువా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8:15 గంటల ప్రాంతంలో రీతురాజ్ హోటల్‌లో మంటలు చెలరేగాయని కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. 14 మృతదేహాలను వెలికితీశామని, అనేక మందిని రక్షించామని ఆయన చెప్పారు. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు. మరోవైపు, జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
14 killed as fire rips through hotel in central Kolkata
Read @ANI Story | https://t.co/lZ6PAU6iIF #Kolkata #Fire pic.twitter.com/qsbPXQCW1m
— ANI Digital (@ani_digital) April 30, 2025
కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. బాధిత ప్రజలను రక్షించడం, వారికి అవసరమైన సహాయం అందించడం వంటి వివరాలను ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..