ఈ ఏడాది చివరి రోజున స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసింది. శుక్రవారం సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,253 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 17354 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లోని టాప్ 30 స్టాక్ల్లో 26 స్టాక్‌లు లాభాలను అర్జించాయి. మిగిలిన నాలుగు స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి.
ఆటో టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉండగా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. నేడు బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.265.97 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది నిఫ్టీలో టాప్ గెయినర్, టాప్ లూజర్ రెండూ ఆటో స్టాక్సే ఉన్నాయి. టాటా మోటార్స్ 162 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా ఉండగా, హీరో మోటోకార్ప్ 21 శాతం పతనంతో టాప్ లూజర్‌గా నిలిచింది.