Money9: డీమ్యాట్ ఖాతాలపై కన్నేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. పెద్ద ఎత్తున మోసాలు..!

|

Jul 27, 2022 | 1:59 PM

Money9: డీమ్యాట్‌ అకౌంట్‌లలో మోసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు డీమ్యాట్‌ ఖాతాలపై కన్నేశారు. ఎవరైనా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడినట్లు పెట్టినట్లయితే ఈ అకౌంట్లపై..

Money9: డీమ్యాట్ ఖాతాలపై కన్నేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. పెద్ద ఎత్తున మోసాలు..!
Demat Account
Follow us on

Money9: డీమ్యాట్‌ అకౌంట్‌లలో మోసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు డీమ్యాట్‌ ఖాతాలపై కన్నేశారు. ఎవరైనా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడినట్లు పెట్టినట్లయితే ఈ అకౌంట్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా క్షణాల్లోనే సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం బ్యాంకు అకౌంట్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చారు. ఇప్పుడు డీమ్యాట్‌ అకౌంట్‌లను లక్ష్యంగా చేసుకుని ఖాతాదారులను మోసగిస్తున్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద ఐటీ నిపుణుల వరకు డీమ్యాట్‌ అకౌంట్‌ తీసి స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయినా ఇలాంటి వారు సైబర్‌ నేరగాళ్లు ఉచ్చులో పడిపోతున్నారు. సైబర్‌ నేరస్తుల మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలి. అయితే స్టాక్‌ మార్కెట్లో షేర్ల కొనుగోలు చేసేందుకు డీమ్యాట్‌ అకౌంట్‌ అవసరం. ఖాతాదారుడి ద్వారా కొనుగోలు, విక్రయించబడిన షేర్ల రికార్డులు ఉన్న ఖాతాను డీమ్యాట్‌ అకౌంట్‌ అని పిలుస్తారు.

నిబంధనల ప్రకారం.. డీమ్యాట్‌ అకౌంట్‌ నుంచి షేర్లను విక్రయించినప్పుడు తర్వాత దానికి సంబంధించిన డబ్బులు అకౌంట్‌కు బదిలీ అవుతాయి. అదే విధంగా షేర్లను కొనుగోలు చేసినప్పుడు వాటి డబ్బులను సైతం డీమ్యాట్‌ అకౌంట్‌ నుంచే చెల్లించాల్సి ఉంటుంది. డీమ్యాట్‌ అకౌంట్ల ద్వారా పెద్ద ఎత్తున షేర్లు విక్రయాలు, కొనుగోళ్లు జరుగుతుండటంతో సైబర్‌ నేరగాళ్లు నిఘా వేసి రెప్పపాటులోనే మోసగిస్తున్నారు.

దేశంలో మంచి పేరున్న కంపెనీల నుంచి డీమ్యాట్‌ అకౌంట్‌ను తీసుకోవడం మంచిది. ఎన్నో కంపెనీలు డిజిటల్‌ ఆధారంగానే ఖాతాలను ప్రారంభించేందుకు అవకాశం ఇస్తున్నాయి. ముఖ్యంగా సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రోజుల్లో డీమ్యాట్‌ అకౌంట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. లేకపోతే ఖాతాదారుడిని సైబర్‌ నేరగాళ్లు బురిడి కొట్టించే ప్రమాదం ఉంది. ఎవరితోనూ వ్యక్తిగత వివరాలు, అకౌంట్‌ వివరాలు, ఓటీపీ లాంటివి చెప్పకపోవడం మంచిది. బ్యాంకు ఖాతాదారులను మోసం చేసినట్లు ఇప్పుడు డీమ్యాట్‌ ఖాతాదారులను కూడా మోసగిస్తున్నారు నేరగాళ్లు. స్టాక్‌మార్కెట్ల షేర్ల గురించి చెబుతూ క్షణాల్లోనే బురిడి కొట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు నేరగాళ్లు. అందుకే డీమ్యాట్‌ అకౌంట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

Source Link

స్టాక్‌మార్కెట్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు