Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS First Woman Mechanic: తెలంగాణాలో మొదటి మహిళా మెకానిక్‌పై కవిత ప్రశంసల వర్షం.. ఆర్ధికంగా అండగా ఉంటామని హామీ

కొంతమంది జీవనోపాధికి ఎన్ని అవకాశాలున్నా .. వచ్చినా వినియోగించుకోకుండా.. ఊహల్లో తేలియాడుతూ భ్రమల్లో బతుకుతారు.. మరికొందరు.. తను తనతో పాటు కుటుంబాన్ని పోషించుకోవడానికి..

TS First Woman Mechanic: తెలంగాణాలో మొదటి మహిళా మెకానిక్‌పై కవిత ప్రశంసల వర్షం.. ఆర్ధికంగా అండగా ఉంటామని హామీ
Follow us
Surya Kala

|

Updated on: Feb 01, 2021 | 10:29 AM

TS First Woman Mechanic: కొంతమంది జీవనోపాధికి ఎన్ని అవకాశాలున్నా .. వచ్చినా వినియోగించుకోకుండా.. ఊహల్లో తేలియాడుతూ భ్రమల్లో బతుకుతారు.. మరికొందరు.. తను తనతో పాటు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అటువంటి కోవలోకి చెందిన మహిళ ఆదిలక్ష్మి.

పేదరికం ఆమెను మెకానిక్ గా మార్చింది. పిల్లల పోషణకోసం భర్తతో కలిసి వాహనాల పంచర్లు, మెకానిక్ పనిచేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచింది. మగాళ్లకు దీటుగా మెకానిక్ గా మారి తెలంగాణాలోనే మొదటి మహిళా ఫేమస్ అయ్యింది. ఈ కుటుంబం స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి. బతుకుతెరువు కోసం నగరం బాటపట్టారు. సుజాత నగర్‌లో భర్త మెకానిక్ షాపు పెట్టాడు. భర్త పంక్చర్లుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్త సంపాదన తో ఇల్లుగడువడం కష్టంగా మారడంతో ఆదిలక్ష్మి భర్తకు తోడుగా పంక్చర్ షాపుకు వెళ్లి పనులు నేర్చుకుంది. బంధువులు, స్నేహితులు ఎగతాళిచేసినా …అవేమి పట్టించుకోకుండా.. మెకానిక్‌గా పని కొనసాగిస్తోంది.

ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి చేరింది. కవిత.. నేరుగా ఆదిలక్ష్మితో మాట్లాడి అభినందించారు. షాపుకు కావాల్సిన అధునాతన మెషిన్లను అందిస్తానని హామీనిచ్చారు. అంతేకాదు ఆ దంపతుల ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. మహిళలు ప్రయత్నిస్తే ఏమైనా సాధించగలరని ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని కవిత అన్నారు. అయితే అడగకుండానే తమకుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవితను మెకానిక్ ఆదిలక్ష్మి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాను మెకానిక్ గా రాణించడానికి భర్త వీరభద్రం ప్రోత్సాహంఎంతో ఉందని ఆదిలక్ష్మి చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే తానే కొత్తషాపు పెట్టుకుంటానని అన్నారు. ఉన్న అవకాశాన్ని ఆలంబనంగా చేసుకుని మహిళ మగారికి ధీటుగా ఎగదవచ్చు అని మరోసారి నిరూపించింది ఆదిలక్ష్మి

Also Read: తెలంగాణాలో తగ్గుముఖం పట్టిన కరోనా.. గత 24గంటల్లో 118కొత్త కేసులు నమోదు