Breaking News
  • 46వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • నేడు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం
  • సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
  • గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీస్‌లో చోరీ
  • రూ.10 లక్షల నగదు అపహరణ, కేసు నమోదు చేసిన పోలీసులు
  • తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు
  • శ్రీనగర్‌: సియాచిన్‌లో మంచుతుఫాన్‌. 18 వేల అడుగుల ఎత్తులో మంచుతుఫాన్‌. మంచుకింద చిక్కుకున్న 8 మంది సైనికులు. నలుగురు సైనికులు సహా ఇద్దరు సహాయకులు మృతి. మరో ఇద్దరు సైనికులకు గాయాలు.

ఎస్వీ రంగారావు తెలుగు జాతి గర్వించే నటుడు : చిరంజీవి

SV Ranga Rao Statue Unveiled by Chiranjeevi, ఎస్వీ రంగారావు తెలుగు జాతి గర్వించే నటుడు : చిరంజీవి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఎస్వీఆర్‌ వంటి గొప్ప నటుడు తెలుగువారు కావడం మన అదృష్టమని, ఆయన నటనే తనకు ప్రేరణ అని అన్నారు.  ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. తాడేపల్లిగూడెంలోని ఎస్వీఆర్‌ సర్కిల్ కె.యన్.రోడ్‌లో ఏర్పాటు చేసిన 9.3 అడుగుల విగ్రహాన్ని గతంలోనే ఆవిష్కరించాలని తొలుత భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….‘ నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏడాది క్రితం నన్ను కోరారు. అయితే సైరా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ అవకాశం లభించింది. ఎస్వీ రంగారావుగారిని చూసే నేను నటుడిని అవ్వాలని మద్రాస్‌ వెళ్లాను. ఈ రోజు మీ ముందు ఇలా నిలబడగలిగాను.  విగ్రహావిష్కరణకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని, చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా జిల్లాకు వచ్చిన నన్ను అక్కున చేర్చుకున్న అందరికీ కృతజ్ఞతలు. అలాగే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఎస్వీ రంగారావుగారి ఆశీస్సులు ఎప్పటికీ నాకు ఉంటాయి.’ అని అన్నారు.

కృష్ణాజిల్లా నూజివీడులో ఎస్వీఆర్‌ జన్మించారు. మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు.

1946లో వచ్చిన ‘వరూధిని’ చిత్రంతో నటుడిగా మారారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో సినిమా అవకాశాలు రాలేదు. ఆపై కొన్ని రోజులు ఓ సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300ల చిత్రాలకు పైగా నటించారు. ఆయన ఏ పాత్ర వేసినా అందులో పరకాయ ప్రవేశం చేయడం..తన డైలాగ్ డిక్షన్‌తో కట్టిపడేయడం ఎస్వీఆర్‌కి అలవాటు. తెలుగు చిత్ర సీమ గర్వించదగ్గ నటుల్లో ఎస్వీఆర్ ముందువరసలో ఉంటారు.