ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మందికి నిద్రలేమి సమస్య ఒక పెద్ద జబ్బుగా మారిపోయింది. రోజులో గంటల తరబడి కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ ముందు కూర్చోవడం.. అదే పనిగా ఫోన్ చూడడం వలన రాత్రిళ్లు సరిగా నిద్రపోలేరు. ఇవే కాకుండా.. మానసిక ఒత్తిడి.. ఒకే విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం వలన కూడా నిద్ర పోలేరు. రాత్రిళ్లు నిద్ర పట్టక బెడ్ పై అటు ఇటు దొర్లుతుంటారు. కళ్లు గట్టిగా మూసుకోని నిద్రపోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయినా నిద్ర మాత్రం పోలేరు. ఇందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఘాడ నిద్ర కోసం కొన్ని సహజమైన టిప్స్ ఫాలో అయితే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. మరి అవెంటో తెలుసుకుందామా.
☛ రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి. లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకుంటూ పడుకోవాలి.
☛ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొబైల్ ఫోన్ గురించి. నిద్రపోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడడం మానేయాలి. అంతేకాదు రాత్రిళ్లు తన పక్కన ఫోన్ పెట్టుకోవడం వలన రేడియేషన్ ప్రభావం వలన కూడా సరిగా నిద్ర పట్టదు. కాబట్టి ఫోన్ ను దూరంగా పెట్టాలి.
☛ రాత్రి పూట పడుకునే ముందు కాసిన్ని గోరువెచ్చని పాలు తాగాలి.
☛ రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్ధన చేయాలి.
☛ చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకలకు మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. అలాగే చేతులతో అరికాళ్లను మెల్ల మెల్లగా మర్ధన చేయాలి.
☛ పడుకునే ముందు నాటు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
☛ గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
☛ రాత్రి పడుకునే ముందు ఓంకారం లేదా మృదువైన సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా శ్యాస మీద మీద ద్యాస పెట్టి కళ్లు మూసుకొని పడుకోవాలి. ఇలా చేస్తే సులభంగా ఘాడ నిద్రలోకి జారుకుంటారు.